Followers

అప్పులుచేసి పప్పుకూడు - ఆస్తులమ్మి పరిపాలనా

 అప్పులుచేసి పప్పుకూడు - ఆస్తులమ్మి పరిపాలనా

ఇదేనా మీ పాలనా దక్షత

భీమిలి, పెన్ పవర్

సంపద సృష్టించి  పరిపాలన చేసే నాయకులను చూసానుగాని  ప్రభుత్వ భూములను అమ్మి పరిపాలన చేసే ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.తెలుగుదేశం పార్టీ భీమిలి కార్యాలయంలో శనివారం పత్రికా విలేకరులతో  మాట్లాడుతూ  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన నాటినుండి నేటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని,కానీ ఎవరూ కూడా  ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన సొమ్ముతో పాలన చేయాలని అనుకోలేదని అన్నారు.ఇలాంటి నిర్ణయం సరైనది కాదని అన్నారు.ఈ 21 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా సంక్షేమ పథకాలు అనిచెప్పి అప్పులుచేసి ప్రజలను తిప్పలు పెడుతున్నారని అన్నారు.సంపద సృష్టించడం,కొత్త కంపెనీలు రాబట్టడం, ఉద్యోగ అవకాశాలు రాబట్టడం ఇది రాష్ట్ర అభివృద్ధికి,రాబోయే తరానికి ఆదర్శవంతమైన పాలన అని  ఇలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలన అంతా ప్రజా వ్యతిరేక పాలనలా సాగుతుందని  అన్నారు.  కొత్త కంపెనీలు లేక సంపద లేక రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఏమి చేద్దామని అనుకుంటున్నారని గంటా నూకరాజు ప్రశ్నించారు.అస్తవ్యస్త పరిపాలనతో పక్క రాష్ట్రాల పాలకులు ఆంధ్రప్రదేశ్ ను చూసి నవ్వుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ ని నవ్వులపాలు చేయొద్దని అన్నారు.రాజధాని లేదు,పోలవరం లేదు,  కొత్త కంపెనీలు లేవు,ఉద్యోగాలు లేవు,జీతాలు ఇవ్వడానికి ఖజానా లేదు అదీకాక  ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మకానికి పెడితే దిక్కులు చూస్తారు, పోర్టులను ఆదానికి ఇస్తారు  ఇంతకు మీరేమి చేస్తారు.రాష్ట్రంలో ఉండే భూములను అమ్ముకొని ఊరేగుతారా..?   రాబోయే తరం వారికి ఎటువంటి ఆస్తులు లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెడదామని అనుకుంటున్నారా..?  అని ప్రశ్నించారు.భూమి అనేది నాయొక్క ప్రాంత సరిహద్దు మరియు భావితరాలవారికి  జీవనరేఖ.అలాంటి భూమిని ఎవరో ప్రయివేటు వ్యక్తులకు అమ్మేసి వచ్చిన డబ్బుతో పాలన చేయడం అనేది సిగ్గుమాలిన చర్య అని అన్నారు.  జనాభా ఎప్పటికైనా పెరగవచ్చు తగ్గొచ్చు గాని భూమి అనేది స్థిరత్వం అని,పెరిగే చాన్సు ఉండదని  అలాంటప్పుడు మీ చేతకాని పాలనకోసం భూములను అమ్మేస్తే  రాబోయే తరం వారికి ఎటువంటి ఆస్తులు మిగల్చకుండా రోడ్డున పడేద్దామనా..! అని గంటా నూకరాజు ప్రశ్నించారు.భావితరాల ఆశల్ని కాలరాస్తున్న  మీరు తక్షణమే భూముల అమ్మకం ప్రక్రియకు స్వస్తి పలకాలని అన్నారు.జనావాసాలో భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తే  రాబోయే రోజుల్లో జనాలు సముద్రంలో ఇల్లులు కట్టుకొని ఉంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనాలు   విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో భూములను అమ్మే ప్రక్రియకు స్వస్తి పలకాలని లేని పక్షంలో  ప్రజలే సరైన బుద్ధిచెప్పే రోజులు వస్తాయని గంటా నూకరాజు అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...