రిజర్వేషన్లు అమలు చేసే ప్రభుత్వరంగాన్ని రక్షించుకుందాం!
మహారాణి పేట, పెన్ పవర్
విభిన్న ప్రతిభావంతులకు,మహిళలకు,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగ,ఉపాధికల్పించే దానిలో రిజర్వేషన్లు అమలుచేసే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని ఇన్సూరెన్సు కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి ఎన్.రమణాచలం పిలుపునిచ్చారు. జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ వేదిక అధ్వర్యంలో నడుస్తున్న దీక్షలు నేడు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (యన్.పి.ఆర్.డి) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విభిన్న ప్రతిభావంతులు కూర్చొన్నారు. వీరితో పాటు మున్సిపల్ వర్కర్స్ ఎఐటియుసి సభ్యులు కూడా ఉన్నారు. దీక్షలను రమణాచలం ప్రారంభించి మాట్లాడుతూ సరేంద్రమోడీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి సామాజిక భద్రతలేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వికలాంగులకు,మహిళలకు, ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉపాధి కల్పించడమే కాకుండా కొన్ని సౌకర్యాలు కూడా పొందుతున్నామన్నారు.ఇప్పటికే ప్రైవేట్ రంగం విస్తరించినా ఎక్కడా రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే ఈ దేశంలో రిజర్వేషన్లు పొందుతున్న వారి జీవితాలు అంధకారంలోకి పోతాయన్నారు. అందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని,ఇతర బ్యాంకులు,ఇస్సూరెస్సూ,ఆయిల్ రంగం,విద్యుత్, రక్షణ,రైల్వే రలగాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకొని మోడీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులు సైతం ఉద్యమాల్లో పాల్గొని కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారని గుర్తుచేసారు. ఈ దీక్షలలో ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు,జిల్లా కార్యదర్శి బుగిరి నూకప్పారావు,అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు,నగర అధ్యక్షులు పాల వెంకయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరమణ, విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ సంఘంతో పాటు ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు,వేదిక వైస్ ఛైర్మెన్ పడాల రమణ మున్సిపల్ నాయకులు లింగాల వెంకటేష్,కాసారపు సత్యన్నారాయణ,బంగారిశవ, ప్రసాద్ లు కూర్చొన్నారు.సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.ఎస్.వి.కుమార్,ఎం.సుబ్బారావు,వై.రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment