ఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
కోవీడ్ నిబందనాలు పాటిస్తూ
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్టిఆర్ఎస్,పార్టీ ఆవిర్భావ వేడుకలు,ఎల్లారెడ్డిపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు,కోవీడ్ నిబంధనలు పాటిస్తూ మంగళవారం ఘనంగా జరిగాయి. మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాలలో పార్టీ జెండాలను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, వరసకృష్ణహారి పలు, గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ జెండాలను, ఎగరవేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరసకృష్ణహారి .ఎంపిపి పిల్లి రేణుక లు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు కార్య కర్తలకు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం సాధన కోసము పార్టీ ప్రకటించి ప్రత్యేక రాష్ట్రం సాదించుటకై ఉద్యమించిన రోజు నేడు అంకుఠిత దీక్షతో కార్యోన్ముఖుడై సమస్త తెలంగాణ ఉద్యమకారులు వెంట నడువగా ఆనేక ఆటుపోట్లను వెన్నుపోట్లను ఎదుర్కోని యావత్ తెలంగాణ ప్రజానీకాన్నీ ముందుండి నడిపించి రాష్ట్రాన్ని సాధించిన మహాత్ముడు బంగారు తెలంగాణ సాధకుడు కెసిఆర్ అని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి ఇంటిపై జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య. గ్రామ శాఖ అద్యక్షులు నేవూరి వెంకట నర్సింహారెడ్డి ఇంటిపై వెంకట నర్సింహారెడ్డి. టిఆర్ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు బండారి బాల్ రెడ్డి ఇంటిపై బండారి బాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్విండో చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి .బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్. మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట నరసింహా రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి.గోగూరి ప్రథీఫ్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అద్యక్షులు ఎడ్ల లక్ష్మన్. శివరామకృష్ణ. చంద్రం.ఆప్జల్. అజ్జు.జవ్వాజీ రామస్వామి. బందారపు బాల్ రెడ్డి. లాల్ బాయి. ఆజీబాబా ఆలీమ్బాయి, చకినాల వెంకటయ్య. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment