నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం..
ఎమ్మెల్యే తన వేతనం నుండి1 లక్ష ఆర్థిక సాయం..
ముగ్గురు పిల్లల చదువుకు భరోసా ఇచ్చారు..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మక్దుంనగర్ లో నివాసం ఉంటున్న సత్యలక్ష్మీ...తల్లి తండ్రులను కోల్పోయిన తన అన్న పిల్లలు సాయి తేజ(15), చరణ్ తేజ(12), వరుణ్ తేజ(10)లను అన్ని తానై చూసుకుంటుంది. ఈ ముగ్గురు పిల్లల తల్లి అనారోగ్యంతో, తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోవడం వల్ల ఈ పిల్లల పోషణను సత్యలక్ష్మీ చూసుకుంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో వారి చదువుల నిమిత్తం సత్యలక్ష్మీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.1 లక్ష విలువ చేసే చెక్కును తన గౌరవ వేతనం నుండి ఆమెకు శనివారం తన నివాసం వద్ద అందజేశారు. అలాగే ముగ్గురు పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించే విధంగా ఏర్పాటు చేస్తానని భరోసానిచ్చారు. ఈ మేరకు తమకు అండగా నిలిచిన సందర్భంగా సత్యలక్ష్మీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment