Followers

చేతులెత్తిమొక్కుతా ౼ లాక్డౌన్ కి సహకరించండి

 చేతులెత్తిమొక్కుతా ౼ లాక్డౌన్ కి సహకరించండి

గుమ్మలక్ష్మీపురం,  పెన్ పవర్

చేతులెత్తిమొక్కుతాను వర్తకులందరూ లాక్డౌన్ ప్రక్రియకు సహకరించాలని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ .గౌరీశంకర్ ప్రతీవర్తకుని దగ్గరకు వెళ్లి చేతులు జోడించి వేడుకున్నారు. కరోనా రెండవ దశ ప్రారంభంలోనే గ్రామంలోని వర్తకసంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి స్వచ్చంద లాక్డౌన్ కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం 6గంటల నుండి మధ్యాన్నం 2వరకు వ్యాపార సముదాయాలను తెరిచి వ్యాపారాలను కొనసాగించాలని ఆ  తరువాత స్వచ్చందంగా షాపులను మూసివేయాలని పెద్దల సమక్షంలో తీర్మానించుకున్నారు. 

అయినప్పటికీ కొంతమంది వర్తకులు ఆ సమయాన్ని పాటించకుండా తీర్మానానికి తూట్లు పొడవడంతో ప్రతీ షాప్ దగ్గరకు వెళ్లి ఈ విధంగా వేడుకుంటూ కోవిడ్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పిస్తున్నారు.ప్రజలందరూ సహకరించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ వర్తకుడు మాస్క్, సానీటైజర్ ఉపయోగించాలని అలాగే షాపుకు వచ్చిన వినియోగదారులకు తప్పనిసరిగా మాస్క్ ఉంటేనే సరుకులను ఇవ్వాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్ తో పాటుగా మాజీ సర్పంచ్ పాలక.ప్రేమనంద్,వైస్. సర్పంచ్ కిషోర్, వర్తకసంఘ అధ్యక్షులు కొత్తకోట.విష్ణు,ఉప అధ్యక్షులు మజ్జి. ప్రసాదరావు,Vro బోడెమ్మ,గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...