నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైసిపి లో చేరికలు
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మండలం ప్రక్కిలంక రావిపాటి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గురువారం జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించడానికి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తాళ్లపూడి వైసిపి బిసి సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తాళ్లపూడి నుండి తెలుగుదేశం సీనియర్ బిసి నాయకులు మరియు ప్రముఖ వస్త్ర వ్యాపారి వుడతా రామకృష్ణ, తెలుగుదేశం బిసి యువజన నాయకులు వుడతా వీరేంద్ర కుమార్, తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షులు వనిమిరెడ్డి శ్రీను, మరియు 20 మంది సభ్యులు వైసిపి లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికి మంత్రి వనిత పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల వైసిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment