కరోనాతో ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మృతి
మంచిర్యాల , పెన్ పవర్మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (49)అనే ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో సోమవారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుండి కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన మంచిర్యాల లోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మండలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరి మన్నలను పొందిన శ్రీనివాస్ అకాల మరణం ఉద్యోగులు, మండల అధికారులను తీవ్ర దిగ్భ్రాంతి కి గురవుతున్నారు. ఆయన మృతి తో మండలంలో విషాధచాయలు అలుముకున్నాయి . శ్రీనివాస్ కి భార్య మంజుల, కొడుకు సాయి, కూతురు శృతి ఉన్నారు.
No comments:
Post a Comment