చదువు క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ తోడుగా ఉంటుంది
....ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
...దేవాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఓఎస్డీ
... రాణాలో ఉన్న మావోయిస్టు దళం కదలికల రిజిస్టర్ ను, రికార్డ్ లను పరిశీలన
...సమీప గ్రామాల యువత కి వాలీబాల్ కిట్స్ పంపిణీ
మంచిర్యాల , పెన్ పవర్రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాణాలో ఉన్న మావోయిస్టు దళం కదలికల రిజిస్టర్ ను, రికార్డ్ లను పరిశీలించారు.మండల భౌగోళిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మావో యిస్టు కదలికల గురించి ఆరా తీశారు.లక్ష్మిపూర్ , కుర్రెగాడ్ , మద్దిమడా , పెద్ద అరిదపెల్లి , గట్రాపల్లి , బుగ్గగూడెం గ్రామాల యువత కి వాలీబాల్ కిట్స్ అందజేశారు.ఈ సందర్బంగా ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ మాట్లాడుతూ యువకులు ఉన్నత విద్య నేర్చుకోవాలని వారి తల్లిదండ్రుల కి మంచి పేరు తేవాలని , వారి గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గొప్పగా మంచి పేరు తీసుకొని వెళ్లాలని, చదువు క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ , ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు.మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దని అన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఓఎస్డీ యువకులతో అన్నారు. పోలీసు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తుల పై నిఘా పెట్టమని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓఎస్డీ వెంట ఏసీపీ మహేష్, ఎస్ఐ విజేందర్ ఉన్నారు.
No comments:
Post a Comment