మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి
- ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి.
తొర్రూరు, పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పదకొండవ వేతన సవరణ కమిషన్ సూచన ప్రకారం... ప్రతి కార్మికుడికి 30% జీతాలు పెంచి, ఇవ్వాలని, ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి అన్నారు.మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు సమస్యపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ కట్ట స్వామికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ ... పిఆర్సిలో పేర్కొన్నట్టుగా 19,000 వేల రూపాయల జీతం పై 30% శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. జీవో నెంబర్ 14 సవరించి,కేటగిరీల వారీగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచి, వారిని ఆదుకోవాలని, తెలియజేశారు. కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తున్న భయపడకుండా నగరాలను, పట్టణాలను, పరిశుభ్రంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, అన్నారు. కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని కార్మికులందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రవి అన్నారు. మున్సిపల్ కార్మికులకు కావాల్సిన బ్లౌజులు, సబ్బులు, బెల్లం, అరటి పండ్లు, తదితర కనీస సౌకర్యాలు అందించాలని, అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎండి. షరీఫ్, రాఘవేంద్ర స్వామి, నారాయణ ఎల్ డివిజన్ నాయకుడు బంగారు శ్రీనివాస్ లతో పాటు, ప్రసాద్, మహేందర్, రాజశేఖర్, వెంకన్న, ప్రశాంత్, వెంకన్న, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment