ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
దేశంలో ఇంటింటికి నరేంద్ర మోడీ అభివృద్ధి ఫలాలు
కొత్తగూడ , పెన్ పవర్భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కొత్తగూడ మండల ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించడం జరిగినది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పార్టీ ఆ విర్భావం నుంచి ఇప్పటివరకు జాతీయవాద సిద్ధాంతాన్ని ఏకాత్మక మానవతా సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పార్టీ శ్రేయస్సుకు పార్టీ నిరంతరం కష్టపడుతూ ప్రతి కార్యకర్త మొక్కవోని విశ్వాసంతో ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలను ప్రతి చిట్టచివరి వ్యక్తికి అందించే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందున్నదని చెప్పవచ్చు ఈరోజు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి మురళి బిజెపి, రాష్ట్ర వన బంధు కన్వీనర్ బోడ నవీన్ నాయక్, జిల్లా కార్యదర్శి భూపతి, తిరుపతి కొత్తగూడ బూత్ అధ్యక్షులు బిక్షపతి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి వజ్జ రవి, కోశాధికారి ఈసంనరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కొట్టి శ్రీనివాస్, మంజుల పల్లి అరవింద్, చీర బోయిన యాకయ్య, కల్తీ సతీష్, తోటకూరి మధు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment