Followers

నార్త్ కమలానగర్ డివైడర్ లను తొలగించేందుకు చర్యలు

 నార్త్ కమలానగర్ డివైడర్ లను తొలగించేందుకు చర్యలు

  పెన్ పవర్, కాప్రా

ఏఎస్ రావు నగర్ డివిజన్ ప్రజల రాకపోకలకు ఇబ్బంది గా మారిన నార్త్ కమలానగర్ డివైడర్ లను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాప్రా సర్కిల్ ఏఈ సంతోష్ రెడ్డి తో కలిసి డివైడర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి డివైడర్ లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ట్రాఫిక్ పోలీసులు సానుకూలంగా స్పందించాలని ఆమె తెలిపారు. అదే విధంగా డివిజన్ పరిధిలోని జిఆర్ రెడ్డి నగర్ లో విద్యుత్ సమస్య కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే   విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అల్లురయ్య   కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...