దేశంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించండి..
కరోనా తీవ్రత తగ్గే దాకా లాక్‌డౌన్ ప్రకటించండి
బి.జె.పి,రూపాకుల రవికుమార్ మెడికల్ కన్వీనర్ ఆంధ్ర ప్రదేశ్
మహారాణి పేట, పెన్ పవర్
కరోనా రోగులు వైద్యం పొందుతున్న ప్రతి ఆస్పత్రిలోనూ ఉదయము,సాయంత్రము నోడల్ అధికారులు పర్యవేక్షించాలి. రోగుల సౌకర్యం కోసం హెల్ప్ డెస్క్ లు ఉంచాలి. దీనిని ప్రతి నిమిషము బాధ్యతగల అధికారులు పర్యవేక్షించాలి .దీని ద్వారా రోగులకు, రోగుల సహాయకులకు సమాచారం అందించాలి . రోగుల బెడ్స్ మీద కేష్ షీట్స్ఉంచాలి.దీనిలో రోగుల యొక్క జబ్బు తీవ్రత వాడుతున్న మెడిసిన్స్ ఉదయం,సాయంత్రం రాయాలి . వెంటిలేటర్స్ ఫిల్టర్స్ ని రోగులు మారినప్పుడల్లా శుభ్రపరచాలి. 24/7 ఆక్సిజన్ నిలవలు ఉంచి లీకేజీ కాకుండా సంబంధిత ఇంజనీర్ లు,టెక్నీషియన్ల పర్యవేక్షణ ఉండాలి. రోగికి నాణ్యమైన పౌష్టికాహారము అందజేయాలి.7- రోగులు ఉన్న ప్రదేశంలో పనిచేయు సీసీ కెమెరాలను అమర్చాలి. పారిశుద్ధ్య పని వారు రెండు గంటలకు ఒకసారి టాయిలెట్స్ ,వార్డులను పరిశుభ్రం చేయాలి. రోగుల దగ్గర డబ్బులు డిమాండ్ చేయరాదు. అడ్మిషన్ కోసం వచ్చిన రోగిని 15 నిమిషాలలో చేర్చుకోవాలి. గత సంవత్సరము విమ్స్ లో రాత్రి సమయంలో రోగులు అత్యవసర పరిస్థితులలో,ఆఖరి నిమిషములలో చేరడానికి వచ్చి,చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ దీనివలన విమ్స్ కి చెడ్డ పేరు వచ్చినది. మరల పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్స్ అందరూ రోగికి నాణ్యమైన వైద్యం అందించి బతికించాలనే తాపత్రయము తో,అంకిత భావంతో కరోనా త్రీవత సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయక వైద్యులు ,వైద్య సిబ్బంది మనకోసం పోరాటం చేయుచున్నారు .వీరిని మనమందరము అభినందించాలి.ఒక్క విమ్స్ లోనే కాక ,కేజీహెచ్ , ప్రభుత్వ చాతి ఆస్పత్రి మరియు అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ రోగులు మరణిస్తున్నారు.కానీ విమ్స్ కె చెడ్డ పేరు వస్తుంది అధికారులు,వైద్యులు ,వైద్య సిబ్బంది మరియు ప్రజలు అందరూ పరస్పర సహకారంతో కరోనా మహమ్మారిని కట్టడి చేసి, విశాఖను కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దుదాం.
No comments:
Post a Comment