రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని )
👉 గత ఆర్ధిక సంవత్సరంలో రూ.30.56 కోట్ల స్టాంపింగ్, కాంపౌండింగ్ ఫీజుల వసూళ్ళు
👉 తూనికలు, కొలతల శాఖ తనిఖీలతో నిత్యావసర ధరల అదుపు
👉 అధిక ధరలు, ఇతర ఉల్లంఘనలపై 19 వేల 493 కేసుల నమోదు
👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, పెన్ పవర్
తూనికలు, కొలతల శాఖ ఐజీపీ, కంట్రోలర్ డాక్టర్ కాంతారావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీలతో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయగలిగామని, గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి 2021 మార్చి 31 వ తేదీ వరకు రాష్ట్రంలో రూ.20 కోట్ల 58 లక్షల 48 వేల 256 ల స్టాంపింగ్ ఫీజులను, రూ. 9 కోట్ల 97 లక్షల 59 వేల 200 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు. ఈ మేరకు గురువారం మంత్రి కొడాలి నాని ఆయా వివరాలను మీడియాకు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు 2020 మార్చి 22 వ తేదీన లాక్ డౌన్ విధించాయన్నారు. ఈ అత్యవసర పరిస్థితులను వ్యాపారులు ఆసరాగా చేసుకుని నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా తూనికలు, కొలతల శాఖ అధికారులు రోజువారీ తనిఖీలు జరపాలని ఆదేశాలిచ్చామన్నారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా అధిక ధరలకు వస్తువులను విక్రయించే దుకాణాలను తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. లాభార్జనే ధ్యేయంగా కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించాలని వ్యాపారులకు సూచించామన్నారు. దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్ ను పూర్తిస్థాయిలో అరికట్టగలిగామని, నిత్యావసర ధరలు పెరగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. అలాగే ఎంఆర్పీ ధరలకు మించి ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడుతున్న దుకాణాలను తనిఖీ చేసి 19 వేల 493 కేసులు నమోదు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 79 లక్షల 27 వేల 745 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 50 లక్షల 18 వేల 600 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,652 కేసులు నమోదు చేశామన్నారు. విజయనగరం జిల్లాలో రూ. 73 లక్షల 12 వేల 875 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 36 లక్షల 97 వేల 900 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,421 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. విశాఖపట్నం జిల్లాలో రూ.2 కోట్ల 98 లక్షల 49 వేల 172 ల స్టాంపింగ్ ఫీజులు, రూ.ఒక కోటి 23 లక్షల 68 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 2,805 కేసులను నమోదు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.2 కోట్ల 40 లక్షల 72 వేల 324 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 96 లక్షల 34 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,698 కేసులు పెట్టడం జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ. ఒక కోటి 54 లక్షల 95 వేల 555 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 72 లక్షల 12 వేల 500 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న , ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,240 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లాలో రూ. 2 కోట్ల 56 లక్షల 96 వేల 902 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. ఒక కోటి 29 లక్షల 74 వేల 200 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 2,555 కేసులు పెట్టామన్నారు. గుంటూరు జిల్లాలో రూ. ఒక కోటి 93 లక్షల 18 వేల 158 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. ఒక కోటి 11 లక్షల 29 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 2,060 కేసులు నమోదు చేశామన్నారు. ప్రకాశం జిల్లాలో రూ. ఒక కోటి 22 లక్షల 59 వేల 055 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 81 లక్షల 73 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,184 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాలో రూ. ఒక కోటి 11 లక్షల 82 వేల 820 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 63 లక్షల 21 వేల 200 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,035 కేసులు పెట్టామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో రూ. ఒక కోటి 79 లక్షల 65 వేల 186 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 57 లక్షల 67 వేల 600 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 937 కేసులను నమోదు చేశామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 99 లక్షల 76 వేల 875 ల స్టాంపింగ్ ఫీజులు, రూ.48 లక్షల 73 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 960 కేసులను నమోదు చేయడం జరిగిందని అన్నారు. అనంతపురం జిల్లాలో రూ.ఒక కోటి 22 లక్షల 53 వేల 460 ల స్టాంపింగ్ ఫీజులు, రూ.72 లక్షల 52 వేల 100 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 859 కేసులను నమోదు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో రూ. ఒక కోటి 25 లక్షల 38 వేల 129 ల స్టాంపింగ్ ఫీజులు, రూ. 58 లక్షల 38 వేల 100 ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశామని, అలాగే ఎంఆర్పీ ధరలకు మించి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన షాపులను తనిఖీ చేసి 1,087 కేసులను నమోదు చేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు.
No comments:
Post a Comment