యువత ఆధ్వర్యం లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మాదా రం టౌన్షిప్ లో భారతరత్న డా.బి. ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు యువత అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ కొందరి వాడుగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రూపుమాపే అవసరాన్ని గుర్తుచేశారు. దేశానికి చేసిన సేవ గురించి,అనాగారిన కులాల అభున్నతికి పాటుపడిన విషయాల గురించి యువతకు వివరించారు.ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ రాజకీయాలకు, కులాలకు అతీతంగా వేడుకలలో పాలు పంచుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు దుర్గం ప్రవీణ్,దుర్గం అశోక్ , మీనుగు క్రిష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత చైతన్ అశోక్ రాహుల్ రాజు శ్రీకాంత్ వినోద్ అజయ్ సాయి ఆకాష్ రాజేష్ మని, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment