Followers

జిల్లా లోని కోవిడ్ పరిస్థితులపై ఆరా...

జిల్లా లోని కోవిడ్ పరిస్థితులపై ఆరా...

 పెన్ పవర్, శ్రీకాకుళం

రాష్ట్ర కోవిడ్ పరిస్థితులపై విజయవాడలో జరుగుతున్న ప్రత్యేక మంత్రుల సమావేశాల నిమిత్తం విజయవాడలో ఉన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ గారితో జిల్లా లోని కోవిడ్ పరిస్థితులపై ఫోన్ ద్వారా సంప్రదించి ఆరా తీశారు, కోవిడ్ నియంత్రణకు, మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి, ప్రజలకు నిత్యం అన్ని సేవలు అందుబాటులో ఉండేందుకు చేపడుతున్న చర్యలపై మాట్లాడారు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఒక రెండు రోజుల్లో కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని, రేపటి నుండి పలాస, ఇచ్చాపురంలో కనీసం 50 నుండి 100 కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు, అలాగే జిల్లాలో ఉన్న అన్ని కోవిడ్ ఆసుపత్రులలో బెడ్స్ కొరత ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం ఐ.ఐ.ఐ.టీ కళాశాల మరియు సిస్టమ్ కళాశాలలలో అదనపు బెడ్స్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు, కోవిడ్ పేషెంట్స్ అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సామాజిక దూరం స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించి కోవిడ్ వ్యాప్తి నియంత్రనుకు సహకరించాలని వారూ ఇరువురు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...