Followers

ప్రజా సమస్యల పరిష్కారానికి “టెలి-స్పందన"

ప్రజా సమస్యల పరిష్కారానికి “టెలి-స్పందన"

 విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు "టెలి-స్పందన”కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., ఆదేశాలతో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు  సోమవారం నిర్వహించారు. "టెలి-స్పందన” కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ,జిల్లా పోలీసు కార్యాలయంలో 08922-276163 ద్వారా 04 ఫిర్యాదులును స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు మాట్లాడుతూ -2వ దశ కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంను తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రతీ సోమవారం ఉదయం 10-30 గం||ల నుండి మద్యాహ్నం 1-00 గం|| వరకు“టెలీ స్పందన" నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై ప్రజలెవ్వరూ సోమవారం నాడు ఎస్పీ కార్యాలయానికి రానవసరం లేదని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలనుకొనే వారు ఇక పై ప్రతీ సోమవారం ఉదయం 10-30 గం||ల నుండి మద్యాహ్నం 1-00 గం||ల మధ్య 08922-276163కు ఫోను చేసి తమ సమస్యలను తెలియజేవచ్చునన్నారు. టెలి-స్పందనకు ఫోను ద్వారా వచ్చిన ఫిర్యాదులను అదనపు ఎస్పీ విని, పరిశీలించి పరిష్కారం నిమిత్తం, సంబంధిత అధికారులను ఆదేశించారు. “టెలి-స్పందన" కార్యక్రమంకు వచ్చిన కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు. విజయనగరం పట్టణం తోటపాలెంకు చెందిన ఒకామె అదనపు ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తన భర్త మరియు అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అదనపు ఎస్పీ ఇరువురిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా దిశా డిఎస్పీని ఆదేశించారు. డెంకాడ మండలం, పెదతాడివాడ గ్రామానికి చెందిన ఒకామె అదనపు ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తను మరియు మరి కొంత మంది కలిసి విశాఖపట్టణంనకు చెందిన భాను అను ఆమెకు కుట్టు మిషన్లు గురించి రూ. 86500/- లు ఇచ్చినట్లు, కాని ఇంత వరకు కుట్టు మిషన్లు అందజేయలేదని మరియు వారి ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించలేదని, వారికి న్యాయం చేయమని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, ఫిద్యాదికి న్యాయం చేయాల్సిందిగా డెంకాడ ఎస్. ఐని ఆదేశించారు. గరివిడి మండలం, వెదుళ్ళవలస గ్రామానికి చెందిన ఒకామె అదనపు ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తన ఇంటి యొక్క ప్రహారీ గోడను కన్నం పెట్టి దాని గుండా అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు వారి యొక్క ఇంటిలో వాడుతున్న మురుగు నీటిని వదిలి పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యతీసుకొని, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గరివిడి ఎస్. ఐను ఆదేశించారు. ఫిర్యాదుల పై సంబంధిత పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు ఆదేశించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...