మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి
మహారాణి పేట, పెన్ పవర్
ప్రజల ప్రాణాల మీద దృష్టిపెట్టాలని,పథకాలమీదకాదని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి హితవుచెప్పారు.శుక్రవారం మీడియాతో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా పథకాలపేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా ధాటికి అనేకమంది విగతజీవులుగా మారుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు.ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, మందులు లేక,ఆక్సిజన్ కొరతతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు.మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని.కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదని విమర్శించారు.వాక్సిన్ సెంటర్ల వద్ద కూడా సరైన ఏర్పాటు చెయ్యకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రజా సమస్యలపై స్పందించాలని కోరారు.పధకాల కంటే ముందు ప్రజల ప్రాణాలు నిలబెట్టేలా వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని సంకు డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment