బోథ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల పార్క్ ప్రారంభం...
బోథ్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా భోథ్ మండల కేంద్రంలో భోథ్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్క్ ను జిల్లా ఇంఛార్జి యస్.పి. రాజేష్ చంద్ర మంగళవారం పోలీసులతో కలిసి ప్రారంభించారు.ఈ సంధర్భంగా డి.యస్.పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ విజ్రంభిస్తున్నందున పోలీస్ కుటుంబాలకు ఈ చైల్డ్రెన్స్ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.పిల్లలకు సెలవులు,పెద్ద వారు బయటకు వాకింగ్ కు వెళితే కోవిడ్ మహమ్మారి అటాక్ అవుతున్నందున ఈ పార్కు వల్ల చిన్నపిల్లలు కోవిడ్ కు గురికాకుండా ఉంటుందని పేర్కొన్నారు.ఈ పార్కు ఏర్పాటు సి.ఐ.నైలు, ఎస్.ఐ.రా జు ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చూడడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టినాక భోథ్ ప్రజలు కూడా తమ పిల్లలను ఈ చిల్డ్రన్ పార్క్ కు తీసుకు రావచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బజార్హత్నూర్ ఎస్.ఐ. ఉదయ్ కుమార్, పోలీసులు వారి పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment