నిస్వార్థ సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం...
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు...
వాలంటీర్ల అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
నర్సీపట్నం, పెన్ పవర్
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చిందని నిస్వార్థ సేవలను అందిస్తున్న వాలంటీర్లు అందరికీ తన ప్రత్యేక అభినందనలు అనీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ ,మాకవరపాలెం మండలాలకు చెందిన గ్రామ /వార్డు వాలంటీర్ లకు ఉగాది విశిష్ట పురస్కారాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ,అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు చేరే విధంగా వాలంటీర్లు నిస్వార్థంగా సేవలను అందిస్తున్నారన్నారు. వీరు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్రప్రభుత్వం "సేవా వజ్ర," "సేవా రత్న","సేవా మిత్ర " పురస్కారాలను, నగదు, అవార్డుల బహుమతుల ను అంద చేయడం జరుగుతుందన్నారు.గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యలను గుర్తించి పై అధికారులకు తెలియజేయడం,అదేవిధంగా పింఛన్లను ఒకటో తేదీ తెల్లవారే లోపల అందజేస్తున్న ఘనత వీరిదే నన్నారు. లాక్ డౌన్ సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక 4 సార్లు ప్రజా సాధికార సర్వే చేశారని కొనియాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడానికి వారధి లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవలసి ఉందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ కీలక అంశం వాలంటీర్లు వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యత చేపట్టిన వెంటనే తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ అని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.వాలంటీర్లు అవినీతికి తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా సేవలను అందిస్తున్నారు అనీ, మునిసిపాలిటీలలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి ఇంటి వద్దకే పధకాలను అందిస్తున్న ఘనత వాలంటీర్లదే అన్నారు. 2020 లాక్ డౌన్ సమయం లో ఇంటింటికి ఫీవర్ సర్వే ,నాలుగు సార్లు సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించడం ద్వారా కోవిడ్ నియంత్రణకు చాలా కృషి చేశారన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని గతవారం ఒకేరోజు 55 వేల మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, ఎవరూ ఎటువంటి అపోహలకు ,అనుమానాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించు కొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఇదే స్థాయిలో అవగాహన చేసుకొని అమలు చేయడానికి కీలక పాత్ర వహించాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి సత్యవతి మాట్లాడుతూ జగనన్న మానస పుత్రిక వాలంటీర్, సచివాలయ వ్యవస్థ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నవరత్నాలను ప్రవేశపెట్టిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు. వాలంటీర్ల అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరింత ఉత్సాహంతో సేవ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ 100% మంది సేవలను అందిస్తున్నారని, ఈ రెండు సంవత్సరాలలో వారు సిస్టమ్ ద్వారా చేసిన పనులను గుర్తించి అవార్డులను అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డును గౌరవమైన సేవ గా తీసుకోవాలన్నారు.సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అక్టోబర్ 2, 2019 సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలను ,సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగిందన్నారు.రెండు సంవత్సరాలుగా గ్రామ వాలంటీర్లు అనేక సేవలను అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం అవగాహన కల్పించడం, ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాలను అందే విధంగా చూస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విస్తృత సేవలను అందించారన్నారు.
కోవిడ్ కష్టకాలంలో ధైర్యంగా విధులను నిర్వహించి విశేష కృషి చేసి ప్రజారోగ్యం కాపాడారన్నారు.నర్సీపట్నం నియోజకవర్గం, మునిసిపాలిటీ కలిపి మొత్తం 1483 మంది వాలంటీర్లు ఉన్నారని వీరిలో 1165 మంది సేవా మిత్ర, 25 మంది సేవా రత్న, ,5 మంది సేవా వజ్ర అవార్డులకు అర్హులు అయ్యారని తెలిపారు పురస్కారాలు అందుకున్న వాలంటీర్లదరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. వాలంటీర్లకు వందనం విశిష్ట పురస్కారాలు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇంటి గడప వద్దకే అందిస్తున్న వాలంటీర్ల పనితీరు ఆధారంగా అవార్డు ఇస్తున్నారనీ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ కు శ్రీకారం చుట్టారన్నారు. నవశకం సర్వే చేసి అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా రేషన్ డోర్ డెలివరీ ,పింఛన్లు ,రేషన్ కార్డులు,కోవిడ్ సర్వే చేసి ప్రజలను కను పాపలు గా కాపాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులు ,విశిష్ట పురస్కారాలను అందిస్తున్నారన్నారు.ఇటీవల కాలంలో వాలంటీర్ల పై దౌర్జన్యం జరుగుతున్నాయని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, మంత్రి కి, పోలీసు అధికారులకు శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం వాలంటీర్లకు విశిష్ట పురస్కారాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, ఏ ఎస్ పి తూహిన్ సిన్హా ,జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జునసాగర్,మున్సిపల్ చైర్ పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి,వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
No comments:
Post a Comment