అన్నదేవరపేటలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ ఎలిమెంటరీ స్కూల్లో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన వారికి వైద్యులు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదేవరపేట పిహెచ్సి డాక్టర్ మైఖేల్, డాక్టర్ కరిష్మా, పంచాయతీ సర్పంచ్ ఎలిపే సుధారాణి, పంచాయతీ సెక్రటరీ అనురాధ, విఆర్వో లు నాగేశ్వరరావు, బోస్, ఆశావర్కర్లు, ఏయన్ఎం లు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment