కోవిడ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మండల కేంద్రమైన ఉలవపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు టాస్క్ ఫోర్స్ నెంబర్స్ తాసిల్దార్ కె .సంజీవ్ రావు ,ఎంపీడీవో టి.రవికూమర్,ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వీఆర్వోలు,పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో తాసిల్దార్ మాట్లాడుతూ కోవిడ్ పై క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోవిడ్ సెకండ్ వేలో ఉలవపాడు మండలంలోని పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కనుక ప్రజా ప్రతినిధులతో కలిసి వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటిని సర్వే చేసి కరోనా పై అవగాహన కల్పించి అనుమానంగా ఉన్నవారిని ప్రజా వైద్యశాల కి తరలించే విధంగా చూడాలి, ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి మండలంలోని ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని వైయస్సార్ బీమా యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు అర్హులైన వారిని నమోదు చేయాలని అని వీడు నిబంధనలు పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి, మౌత్ దూరం పాటిస్తూ, శానిటైజర్, వాడుతూ అదేవిధంగా ప్రజలకు జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలి.
కందుకూరు డిఎస్పి కండే శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ప్రతి మండలంలో క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్ట పడుతున్నారు అని ప్రతి పంచాయతీలోనూ కరోనా పై అవసరమైన పరికరాలను వెంటనే అందించే విధంగా చూస్తున్నారని,కోవిడ్ సెకండరీ తీవ్రత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని పాజిటివ్ వచ్చినవారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తీవ్రంగా ఉందని మరణాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయని అందరూ జాగ్రత్తలు పాటించాలని కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలని అనిమండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి విశ్వనాధ రెడ్డి, డాక్టర్ కే శ్రీనివాసరావు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పాల్గొన్నారు.
No comments:
Post a Comment