గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
పెన్ పవర్, వలేటివారిపాలెం.
మండలంలోని పోలినేని పాలెం, శాఖవరం, పోలినేని చెరువు గ్రామాల్లో సర్పంచ్ లు అనుమోలు అమరేశ్వరి, యాళ్ళ సుబ్బరాజ్యం, గడ్డం భవాణి ల ఆధ్వర్యంలో బుధవారం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా పోలినేని పాలెం, పోలినేని చెరువు గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ట్రాక్టర్ తో పిచికారి చేయించారు. శాఖవరం గ్రామంలో వీధి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
No comments:
Post a Comment