ప్రేమాసమాజం లో జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు...
మహారాణి పేట, పెన్ పవర్
వైస్సార్సీపీ స్టేట్ సీనియర్ నాయకులు జాన్ వెస్లీ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం 33వ వార్డ్ ప్రెసిడెంట్ రంది గోపికృష్ణ ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ప్రేమాసమాజం లో కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్న అభాగ్యులకు కేక్,పండ్లు,డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాన్ వెస్లీ చాలా సౌమ్యుడు,మృదువైన స్వభావం కలిగిన వారని,నియోజకవర్గంలో వైస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తున్న బలమైన నాయకుడని, వైస్సార్సీపీ లో ఉన్నతమైన పదవులు చేపట్టాలని, ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకతో దక్షిణం లో వైస్సార్సీపీ బలోపేతం అయిందని, రాబోయే కాలానికి మినిస్టర్ గా చూడాలని,దీనికోసం నియోజకవర్గంలో వైస్సార్సీపీ కార్యకర్తలు అందరం కలిసి పని చేస్తామని తెలియజేశారు.
No comments:
Post a Comment