Followers

కరోనా వైరస్ ను అంతమొందించడానికి బాట గంగమ్మకు పూజలు

కరోనా వైరస్ ను అంతమొందించడానికి  బాట గంగమ్మకు పూజలు 

మొరంపల్లి, పెన్ పవర్

ప్రపంచ దేశాలను  గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అంతమొందించడానికి బాట  గంగమ్మ తల్లికి పూజలు  నిర్వహించారు .  వివరాలు లోకి వెళితే  ఐరాల మండలం, మొరంపల్లి  గ్రామంలో  వెలిసిన బాట గంగమ్మ తల్లికి గ్రామ ప్రజలు  అంబిలి తో   అమ్మవారికి అభిషేకము, పూజలు,  పొంగళ్ళు పెట్టి ఈ కరోనా వైరస్ ను నాశనం చేసి, కరోనా బారిన పడిన ప్రజలను  రక్షించాలని, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని మొరంపల్లి గ్రామపంచాయతీ  మహిళలు పెద్ద ఎత్తున బాట గంగమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించారు.  ఈ పూజ  కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు,  యువకులు  కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...