నిర్లక్ష్యం తోనే కరోనా వ్యాప్తి
నిర్లక్ష్యం తోటే కరోనా వ్యాప్తి చెందుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ హెచ్చరించారు
రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగాల శ్రీనివాస్ గత పన్నెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 15 రోజుల క్వారంటైన్ ముగియకముందే మూడు రోజుల నుండి అతని షాపు జాగృతి జ్యువెలర్స్ ఓపెన్ చేసి తన వృత్తికి సంబంధించిన కార్యకలాపాలు చేయగా చుట్టుపక్కల వారు గమనించి మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ కు సమాచారం అందించగా మండల వైద్యాధికారి డాక్టర్ మానస మరియు వైద్య బృందం తో రాచర్ల బొప్పాపూర్ చేరుకుని మండల వైద్యాధికారి డాక్టర్ మానస వంగాల శ్రీనివాస్ ను కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తివి ఏ విధంగా బయట తిరుగుతున్నావు. అని ప్రశ్నించగా వంగాల శ్రీనివాస్ నేను కిరణా షాప్ కి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లానని పొంతనలేని సమాధానం చెప్పడంతో మీలాంటి వారి వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వ్యక్తి 15 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఎవరైనా 15 రోజులలో లోపల బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని మండల వైద్యాధికారి ధర్మ నాయక్ అన్నారు. కరోనా వ్యాధి పై నిర్లక్ష్యం వహించినందుకు గాను వంగాల శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ విలేకరులకు తెలిపారు.
No comments:
Post a Comment