Followers

సంకల్ప సభను జయప్రదం చేయండి

 సంకల్ప సభను జయప్రదం చేయండి

మందమర్రి,  పెన్ పవర్

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మార్చి 9న ఖమ్మం పెవిలియన్ మైదానంలో జరుగు సంకల్ప సభకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, షేక్ అజీమోద్దీన్ కోరారు. గురువారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం నెలకొల్పేందుకు చలో ఖమ్మం సంకల్ప మహాసభకు జిల్లాలోని వైయస్సార్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొరల పాలన అంతమై వైయస్ షర్మిల నాయకత్వంలో రాజన్నరాజ్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుద్దాల ప్రభుదేవ్, రాజు, అజయ్, చరణ్, నవీన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...