బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మందమర్రి, పెన్ పవర్భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండలం, పట్టణం లోని అన్ని పోలింగ్ బూత్ లలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జులు పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు డివి దీక్షితులు, పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్, మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జ్ మార్త కుమారస్వామి, మండల యువమోర్చా అధ్యక్షులు పెంచల రంజిత్, మండల మహిళా అధ్యక్షురాలు సుమలత, నాయకులు అందుగుల లక్ష్మణ్, సేపూరి లక్ష్మణ్, గాజుల ప్రతాప్, వంజరి వెంకటేష్, అల్లంల నగేష్, సప్పిడి నరేష్, ఎర్రోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment