గ్రూపులు అన్ని "ఏ గ్రేడ్ ఉండేటట్టు చేయ్యండి
పెన్ పవర్, మర్రిపూడి
మర్రిపూడి మండలం లోని సుమారు వెయ్యి (మూడు)గ్రూపులు అన్ని "ఏ" గ్రేడ్ లోకి వచ్చేటట్టు విఒఏలు పని చేయాలని డిఆర్ డీఏ కొండపి క్లస్టర్ ఏరియా కోఆర్డినేటర్ గోనుగుంట్ల. క్రిష్ణ కుమారి అన్నారు. సోమవారం మర్రిపూడి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో యం. యస్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి మండల మహిళా సమాఖ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బెజ్జం రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మరియు గ్రామ సంఘాలు ఏ గ్రేడ్ లో ఉంటేనే ఆ గ్రామ సంఘం యొక్క విఒఏ మాత్రం పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఏ గ్రేడ్ లో ఆ గ్రామ సంఘం పరిధిలో ఉన్న గ్రూపులు మొబైల్ బుక్ కీపింగ్ మరియు సిబిఓ అకౌంటింగ్, రికవరీ, సమావేశాలు సక్రమంగా జరపాలని కోరారు. ఏపియం బెజ్జం రమేష్ మాట్లాడుతూ పనిచేసే విఒఏలకు మాత్రం జీతాలు ఇవ్వాలి అని సిసిలకు సూచించారు. విఒఏలు అన్ని కాంపోనెంట్స్ యందు వంద శాతం పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. లీగల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే మండలం ముందుంజలో ఉంటుంది అని తెలిపారు. యం. పి డి ఓ కరీముల్లా మాట్లాడుతూ కోవిడ్-19పై అవగాహన సమావేశలు గ్రామాలలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు వివరించాలని అదేవిధంగా మాస్కులు మరియు శానిటైజేషన్ అర్హత కలిగిన వారికి వేయించాలని విఒఏలకు వివరించారు. కార్యక్రమం లో విఒఏలు, భీమా మిత్రాలు మరియు సిసిలు, మండల సమాఖ్య అకౌంటెంట్ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల జరిగిన డిఆర్ డిఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన ఏపియం బెజ్జం రమేష్ ను మండల మహిళా సమాఖ్య తరుపున ఘనంగా సన్మానం చేశారు.
No comments:
Post a Comment