Followers

అక్రమ నిర్మాణాలు కూల్చేసిన జిహెచ్ఎంసి అధికారులు

 అక్రమ నిర్మాణాలు కూల్చేసిన జిహెచ్ఎంసి అధికారులు

పెన్ పవర్, కాప్రా

కార్పొరేటర్ అయితే పైసలు పారేస్తా తీసుకొని పో.. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ కు ఒక బిల్డర్ హెచ్చరిక కాలనీవాసులు ఫిర్యాదుతో రంగంలో దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు  కాప్రా సర్కిల్ పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్ డివిజన్లో ఉన్న ఐ విజన్ సిరినీ" అపార్ట్ మెంట్ ప్రహరీ కూల్చివేత నువ్వు కార్పోరేటర్ అయితే పైసలు పారేస్తా తీసుకొని వెళ్ళిపో అంటూ ఒక బిల్డర్ ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ కు హుకుం  జారీ చేశారు. కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ తీసివేయాలని, రోడ్డు ను కబ్జా చేస్తూ కట్టిన ప్రహరీని లోపలికి జరిపిన నిర్మించుకోవాలని కోరిన ఒక మహిళ కార్పొరేటర్ పై సదరు బిల్డర్ దౌర్జన్యం చేశారు. దీంతో కార్పోరేటర్ తో పాటు కాలనీ వాసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ ఏసిపి ఖుద్దుస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఐ విజన్ సిరీస్ అపార్ట్ మెంట్ ప్రహరీ గోడను కూల్చి వేశారు. తొలుత కాలనీ వాసులు ఐ విజన్ సిరీస్ అపార్ట్ మెంట్ అక్రమాలను కూల్చివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ అపార్ట్ మెంట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్ తొలగించాలని కోరితే బిల్డర్ "డబ్బులు పారేస్తా ఏరుకొని పో" అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు. ప్రజల కోరిక మేరకు స్పందించి ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారుల తీరును కాలనీవాసులు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏసిపి ఖుద్దుస్ మాట్లాడుతూ అపార్ట్ మెంట్ లో నిర్మాణాలు నిబంధనల మేరకు ఉన్నాయో లేదో చూసి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...