మానవత్వాన్ని చాటుకున్న దోమ ఎస్ఐ దేవంబొట్ల రాజు
వికారాబాద్, పెన్ పవర్మానవత్వాన్ని చాటుకున్న దోమ ఎస్ఐ దేవంబొట్ల రాజు దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన వడ్ల పెంటయ్య గత 2 సంవత్సరాల నుంచి పక్షవాతం తో కాళ్ళు, చేతులు, మెడలు చచ్చుబడి మంచానికి పరిమితం అయ్యారు. ఆయన దీన పరిస్థితిని చూసి మనసు చలించి మానవతా దృక్పథంతో పెంటయ్య కుటుంబానికి 5000/- ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ వడ్ల పెంటయ్య ఆరోగ్య పరిస్థితిని చూసి చాలా జాలేసింది, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ కూడా రాకూడదన్నారు. పెంటయ్య కు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వారి కుటుంబ పరిస్థితిని గమనించి ఆయనకు ప్రతినెలా మందుల ఖర్చులకు అయ్యే డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తానన్నారు. అదేవిదంగా ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్ 2500/- రెండు వేల ఐదు వందల రూపాయలను వడ్ల పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ వడ్ల పెంటయ్య ఆర్యోగ్య పరిస్థితిని తెలుసుకొని ఎస్ఐ రాజు, సుందర్ గౌడ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇంతకు ముందే ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్ అతని ధీన స్థితిని తెలుసుకొని అతని పరిస్థితి ని వార్త పత్రికల ద్వారా అందరికి తెలిసేలా చేయడం వల్ల చాలా మందియ దాతలు సహాయం చేయడానికి ముందుకు వచ్చి వారికి తోచిన విదంగా వడ్ల పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇంకెవరయిన దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయగలరని కోరుచున్నాను. . ఈ కార్యక్రమంలో ఆర్.రాములు, IGA జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్, తెరాస పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు చెన్నయ్య, వార్డ్ మెంబర్ ఎస్.బాబు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment