Followers

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య

అరకు, పెన్ పవర్

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య అని పీసీసీ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి  అన్నారు జాతీయ పతాకం రూపకల్పన చేసి  100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శాంత కుమారి మాట్లాడుతూ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు నాటి నాయకుల త్యాగాలే అని అన్నారు ఆ తరం వారిని నేటితరం భవిష్యత్తు తరం కూడా మరువకూడదని అన్నారు స్వాతంత్ర్యం సాధించడానికి కి ఒక్కొక్కరూ ఒక్కొక్క స్థాయిలో ఉద్యమాలు చేశారని వారి ఉద్యమ స్ఫూర్తినీ తీసుకుని ప్రతి ఒక్కరూ పని చేసిన నాడే వారి త్యాగాలకు సార్థకత ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎండపల్లి వలస కస్తూర్బా స్కూల్ విద్యార్థులు జాతీయ గీతం పాడగా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది.


 అక్కడ పాల్గొన్న విద్యార్థులకు మిఠాయిలు పంచిపెడుతూ వారికి నోట్సులు పెన్నలు పెన్సిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి అరకువేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శెట్టి భగత్ రామ్ డుంబ్రిగూడ కండ్రుమ్ పంచాయతీ ఎం పి టి సి కె లోలిత్ మహిళా మండలి అధ్యక్షురాలు లోగిలి చంద్రకళ మహిళా మండల ప్రధాన కార్యదర్శి పాచిపెంట ధనలక్ష్మి మహిళా మండల వైస్ ప్రెసిడెంట్ ఉల్లి నీలవేణి హుకుంపేట మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గంజాయి భాగ్యరాజు అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ హ్యూమన్ రైట్స్ మండల అధ్యక్షుడు చట్టు మోహన్ గుంజిడి సుబ్బారావు స్కూల్ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...