Followers

ఎం.ఎస్.ఎస్.ఓ ఆద్వర్యంలో ఆక్సిజన్ మిషన్ అందజేత

 ఎం.ఎస్.ఎస్.ఓ ఆద్వర్యంలో ఆక్సిజన్ మిషన్ అందజేత

కార్యకర్తకు అండాగా నిలిచిన ఎం.ఎస్.ఎస్.ఓ

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆద్వర్యంలో కొనసాగుతున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో ఓల్డ్ నేరేడ్మట్ కు చెందిన శ్రీనివాస్ కు ఆక్సిజన్ మిషన్ అందజేశారు. శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అతడి వైద్య చికిత్సలో భాగంగా ఆక్సిజన్ మిషన్ కావాలని గతంలో ఎమ్మెల్యే ను కోరారు. వెంటనే స్పందిన మైనంపల్లి హన్మంతరావు రూ94వేల విలువ గల అక్సిజన్ మిషన్ బాధితుడుకి అందజేశారు. ఈ సందర్బంగా బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అపదలోఉన్న వారికి అదుకుని ప్రాణం పోసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ ప్రధాన కార్యదర్శి జీఎన్వి సతీష్ కుమార్, సంతోష్ రాందాస్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...