Followers

కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న మేయర్ దంపతులు....

 కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న మేయర్ దంపతులు....

ప్రజలు నిరభ్యంతరంగా టీకా వేయించుకోవాలి అని పిలుపు
విశాఖ తూర్పు, పెన్ పవర్

దేశ,రాష్ట్రాలతో పాటు నగరంలోనూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మంగళ వారం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు.స్థానిక 11 వ వార్డు ఆరిలోవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  తన భర్త గొలగాని శ్రీనివాస్ తో పాటు వైద్యుల పర్యవేక్షణలో టీకా పొందారు.నిత్యం ప్రజలతో మమేకమై వుండటం వలన తరచూ జనం మధ్యకు వెళ్లాల్సి వస్తోందని,ప్రభుత్వ పిలుపు మేరకు టీకా పొందటం బాధ్యతగా భావించినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా అవకాశాన్ని బట్టి వ్యాక్సిన్ పొందాలని ఆమె కోరారు. మేయర్ తో పాటు వైసీపీ నాయకులు శ్రీనివాస్ టీకా పొందారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...