జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
విజయనగరం, పెన్ పవర్ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీమతి రెడ్డి పావని గారు పార్టీ జెండాను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే ఈరోజు భారతీయ జనతాపార్టీ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది కార్యకర్తల గల పార్టీగా, అతి పెద్ద పార్టీగా రూపొందడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీకి పూర్వం జన సంఘ్ పార్టీగా ఉండేదన్నారు.1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ గా రూపాంతరం చెందింది అన్నారు. అలాగే పార్టీ ఎదుగుదలకు ఎంతోమంది పూర్తి సమయ కార్యకర్తలు త్యాగం మరువలేనిదన్నారు. భారతీయ జనతా పార్టీ కి ఈ దేశం పట్ల, ప్రజల సమస్యల పట్ల, మౌళిక వసతుల పట్ల పూర్తి అవగాహనతో ముందుకు వెళుతుందన్నారు. క్రమశిక్షణ, కార్యకర్తల నిబద్ధత భారతీయ జనతా పార్టీ సొంతం అన్నారు. ఈ కార్యక్రమంలో తీగల హరనాథ్, బగ్గం రాజేష్, కట్టా బాబు, బూర జగ్గారావు, గొలగాన రమేష్, కొండల శ్రీను, పసుపునాటి గిరి, గిరీష్, తాడి నానాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment