కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రతగా ఉండండి
రాజమహేంద్రవరం స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు కోవిడ్ సమస్యలను ఎదుర్కొనేందుకు అభిప్రాయ సేకరణ మరియు సమీక్ష కార్యక్రమాన్ని హోటల్ శ్రీ కన్య లో స్వర్ణాంధ్ర సేవా సమితి వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కరోనా లో రాజమండ్రి ప్రజలకు సేవలందించిన సేవా సంస్థలు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరై వారి వారి అభిప్రాయాలు మరియు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా తమ తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారూ అని వారి అభిప్రాయం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవాసంస్థ తోపాటు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ రాజమండ్రి, హెల్పింగ్ హాండ్స్ రాజమండ్రి, జైన్ సేవా సమితి, మనం చారిటబుల్ ట్రస్ట్ కడియం, ముస్లింస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి, వికాస్ సేవాసమితి రాజమండ్రి వివిధ సేవా సంస్థలతో పాటు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పలువురు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలు మరియు వారి సేవలను ఏవిధంగా కొనసాగించగలరు వాటిపై వారి సూచనలు ఇవ్వడం జరిగింది.
No comments:
Post a Comment