భారీగా పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే అదుపు చేయాలి...సి.పి. ఐ. డిమాండ్
మహారాణి పేట, పెన్ పవర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన పప్పులు, ఉప్పులు,వంటగ్యాస్,వంటనూనె,కాయగూరల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ ఉ.10గంటలకు రైతు బజార్ సీతమ్మధార జంక్షన్లో సి.పి.ఐ. ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సి.పి.ఐ.నగర కార్యవర్గ సభ్యులు జి.వామనమూర్తి మాట్లాడుతూ బి.జె.పి.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజల వాడే నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 78 నెలలు గడిచినా పేద మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా భారీగా పెంచిన పప్పులు బియ్యం కాయగూరలు వంటగ్యాస్ ధరలను నియంత్రించే ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అడ్డు అదుపులేకుండా పెట్రోల్ ధరలు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను జి.ఏస్.టి. పరిధిలోకి తేవాలని సెస్,వ్యాట్ పన్నులను రద్దు చేయాలని ప్రజలకి ఆదాయ వనరులు చూపించలేని ప్రభుత్వం ధరల పెంచే అధికారం ఎవరిచ్చారని ప్రజలు ప్రశ్నించాలని కోరారు.
పెంచిన పాలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.పేద మధ్యతరగతి ప్రజలపై ధరల పెంచుతూ బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ప్రజలపై వేస్తున్న ఆర్థిక భారాలను త్రిప్పు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సి.పి.ఐ. హెచ్.బి,కోలనీ శాఖ సభ్యులు ఎన్.మధు రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజల తేరుకో లేక కరెంటు బిల్లులు,ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ధరలు పెంచి ఆర్థిక భారాలు వేయడం ప్రభుత్వానికి తగదన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్.ఏ.నాయుడు, ఏస్.సూరిబాబు,ఎన్.గణేష్,ఏస్.సన్యాసిరావు, డి.అప్పలరెడ్డి,చిట్టి వెంకట్ నాయుడు,రావి కృష్ణ, దేవుడు,ఏస్.రాము తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment