Followers

వైయస్సార్ భీమామిత్ర చెక్కులు పంపిణీ

వైయస్సార్ భీమామిత్ర చెక్కులు పంపిణీ

తాళ్లపూడి,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత  అన్నారు. చాగల్లు మండలం నెలటూరు శ్రీరామ కళ్యాణ మండపం లో లబ్ధిదారులకు వైయస్సార్ భీమామిత్ర  చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 274 కోట్ల రూపాయలు 12 వేల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చటం జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా సహజ మరణం జరిగితే ఆ కుటుంబానికి రెండు లక్షలు, దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షలు రూపాయలు భీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకంలో భాగంగా  చాగల్లు మండలంలో  14 మంది  కుటుంబాలకు  28 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో ఇంటి పెద్ద మరణించినట్లయితే వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు వైయస్సార్ భీమా మిత్ర పథకానికి ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి కుటుంబంలో ఈ పథకాన్ని ఎన్రోల్మెంట్ చేసి భీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు.   ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా ఎంత ఖర్చయినా నేను భరిస్తాను అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...