ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం కాచికల్ క్రాస్ రోడ్ల సమీపంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారక్క గ్రామైక్య మహిళ సంఘం చే గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ను సర్పంచ్ కాశ మల్ల పద్మ,రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ ఆర్ఎస్ఎస్ వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వి.రూ.1888,సాధారణ రకం రూ 1868 చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనంతుల రమేష్ కుమార్ ఏవో నెల కుర్తి రవీందర్రెడ్డి, ఏ పీ ఎం నరేంద్రకుమార్ ఉప సర్పంచ్ కాసం లక్ష్మారెడ్డి, సంఘం అధ్యక్షురాలు వెంకటమ్మ కార్యదర్శి పూలమ్మ సి ఎ మంజుల సి సి పుల్లయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment