Followers

రెల్లివీధిలో సమస్యలు పరిష్కరించండి...

 రెల్లివీధిలో సమస్యలు పరిష్కరించండి...

భీమిలి, పెన్ పవర్

రెల్లివీధిలో  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు స్థానికులతో కలసి స్కావెంజర్స్ కోలనీ  ఇతర వీధిలో పర్యటించి  అక్కడున్న పారిశుధ్యం,మంచినీటి సమస్యపై  పరిశీలించారు.కాలువలు అన్నీ పూర్తిగా చెత్త మరియు  మురికినీరుతో  నిల్వ ఉండటం,సామాజిక మరుగుదొడ్లు దగ్గర ట్యాoకు పూర్తిగా నిండిపోయి దుర్వాసన రావడం వంటి సమస్యలను స్థానికులు గంటా నూకరాజు దృష్టికి తీసుకొని వెళ్లారు.      అదేవిధంగా సామాజిక మరిగుదొడ్లు దగ్గర  నీటి సౌకర్యం సరీగా లేకపోవడం,  పూర్తిగా సిల్ట్ అవ్వడం    చుట్టుపక్కల వాళ్ళు నివాసం ఉండటానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు.రెల్లివీధిలో మొత్తం 9 బావులు ఉన్నాయని,అందులో కొన్నింటికి బావిలో సిల్ట్ తీయడం,ఒక పెద్ద బావిదగ్గర బావికి చుట్టూ పైపులు ఏర్పాటుచేసి వాటర్ పైలెట్ స్కీం ఏర్పాటు చేస్తే బాగుంటుందని  స్థానికులు గంటా నూకరాజుకి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.దీనిపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు స్పందిస్తూ ఇవన్నీ కూడా జోనల్ కమీషనర్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ తో  మాట్లాడి  పారిశుధ్య సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడమైనది.  కొత్తకాలువల ప్రతిపాదన కూడా సంబంధిత అధికారులకు తెలియజేసి ఏర్పాటు చేద్దామని అన్నారు.శానిటరీ అధికారులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ  కొంతమంది పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా చిన్న చిన్న లోపాలు సంభవిస్తున్నాయని,అవన్నీ సర్దుకుంటాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన భీమిలి జోన్ లో ఉన్న 4వార్డులకు కలిపి ఇంకా 170 మంది పారిశుధ్య కార్మికుల కొరత ఉందని  దీనివలన కొంచెం ఇబ్బందులు ఉన్నాయని,  తప్పకుండా జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళతానని అన్నారు.కాలువలో నిండి ఉన్న చెత్తను శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి త్వరలో పరిష్కారం అయ్యేవిధంగా చేస్తానని అన్నారు.   రెళ్లివీధి జంక్షన్ లో చిన్నపిల్లలు ఎక్కువగా రోడ్డులమీదకు వెళ్లడం,  వాహనాలు అతివేగంగా వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా స్పీడ్ బ్రేకర్లు వేయిస్తానని స్థానికులకు హామీ ఇవ్వడమైనది.అదేవిధంగా సామాజిక భవనాన్ని స్థానికులకు అప్పగించాలన్న వినతికి  గంటా నూకరాజు స్పందిస్తూ 3వ వార్డులో గత ప్రభుత్వ హయాంలో 7 సామాజిక భవనాలు నిర్మించామని,అవి పూర్తయిన వెంటనే  వాటిని స్థానికులకు అప్పగిస్తామని అప్పటి అధికారులు చెప్పారని  తప్పకుండా  ఈ విషయాన్ని జోనల్ మరియు జివిఎంసి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఏ గ్రామం సామాజిక భవనం ఆ గ్రామానికి అప్పగించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడమైనది.

ఒకపక్క కరోనా దేశాన్ని, రాష్ట్రాన్ని వనికిస్తుంటే,   వ్యక్తిగత పరిశుభ్రత,  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోoడని  ఎక్కడికక్కడ  మైక్  ప్రచారం  చేస్తున్నప్పటికీ  అధికారులు పారిశుద్యంపై  కూడా  దృష్టి పెట్టాలని అన్నారు.  ఎక్కడ అయితే స్లమ్ ఏరియాలు ఉన్నాయో  వాటిని  గుర్తించి ఆ ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని గంటా నూకరాజు అధికారులకు సూచించడమైనది.ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చుతున్న దృష్ట్యా  ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి  అధికారులు  అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ కూడా కరోనాపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని,తప్పనిసరికగా మాస్క్ వాడాలని,  శానిటైజర్ వాడుతూ  ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు.జనావాసాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించాలని అన్నారు.ఆస్తులు అంతస్తులు కంటే ప్రాణం చాలా విలువైనదని,ఎటువంటి చిన్న  కరోనా  లక్షణాలు కనిపించినా తప్పకుండా  వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలు సూచనలు పొందాలని అన్నారు.ప్రభుత్వం సూచించిన విధంగా తప్పకుండా 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరూ  వేక్షిన్ చేయించుకోవాలని గంటా నూకరాజు సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పారిశుద్య కార్మికులకు సహకారం అందించి,  రోడ్డులపై చెత్త వేయకుండా జి.వి.ఎమ్.సి. అధికారులు  ఏర్పాటు చేసినటువంటి డస్ట్ బిన్లో చెత్త వేయాలని అన్నారు.  కరోనాను పారద్రోలుటకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలని గంటా నూకరాజు ప్రజలకు పిలుపునివ్వడమైనది.ఈ కార్యక్రమంలో  కుప్పిల గురుమూర్తి,  జలగడుగుల మురళి మరియు ముక్కి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...