Followers

ఇది తుగ్లక్ ప్రభుత్వం....

ఇది తుగ్లక్ ప్రభుత్వం....

విజయనగరం పెన్ పవర్

రోమ్ తగులబడుతుంటే ఫీడెల్ వాయించుకున్నట్లు ఉంది ప్రభుత్వం తీరు. ఓ ప్రక్క ప్రజలు కరోనాతో ఆక్సిజన్ బెడ్స్ లేక, రెమిడిసివర్ ఇంజక్షన్స్ లేక, టెస్టులు సకాలంలో రాక, ఇంటికో మనిషి మరణిస్తుంటే ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ కనీసం బాధ్యత వహించడం లేదుజిల్లా మంత్రి బొత్స ఎక్కడ దాక్కున్నారు.. బొత్స గారు జనాల ఘోష అమరావతిలో ఉన్న మీకు తెలియక పోతే మహాప్రస్థానంను అడుగు చెబుతోంది. జిల్లా ఎమ్మెల్యేలు ఇల్లు కదలటం లేదు, కష్టాల్లో ఉన్న ప్రజలు ఫోన్ చేస్తే ఎత్తటం లేదు. ఓ వైపు జనాలు కాపాడండి మహాప్రభో అంటుంటే వాళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులకు కనీసం బాధ్యత లేకుండా వైసిపి కార్యకర్తలు అయిన వాలంటీర్లకు సన్మాన సభలు పెడతారా? సమావేశానికి వచ్చిన వాలంటీర్లకు, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు నిన్న ఎస్ కోట, ఈ రోజు సాలూరులో వాలంటీర్ల సన్మానాలు నిర్వహించటం భాధ్యతారాహిత్యం. మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తో 15 మందికి పైగా చనిపోతే మరణాలే లేవని అబద్ధాలతో కాలం.  మహారాజా ఘటన పై సమగ్ర దర్యాప్తు పై న్యాయస్థానంను ఆశ్రయిస్తాం. బాధ్యుల పై మర్డర్ కేసు నమోదు చేసేవరకు వదిలిపెట్టం. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు  ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. మృతుల కుటుంబసభ్యులు మా వద్దకు వస్తే వారి వైపు మేము పోరాడతాం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...