ఓగూరులో కరోనా పై అవగాహన ర్యాలీ
పెన్ పవర్, కందుకూరు
మండలంలోని ఓగూరు గ్రామంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పిలుపుమేరకు సోమవారం కరోనా పై అవగాహన ర్యాలీ గ్రామ సర్పంచ్ యనమద్రి కొండమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో వీధివీధినా అవగాహన ర్యాలీ చేపట్టి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నారు. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తొట్టెంపూడి శ్రీనివాసులు, చీమల రాజా, అల్లం రాదయ్య, మాజీ సర్పంచ్ సుబ్బారావు, శ్రీనివాసులు రెడ్డి, కోటయ్య, మాచర్ల, బ్రహ్మారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment