పలు పంచాయతీల్లో పారిశుధ్య పనులు
సంతబొమ్మాళి, పెన్ పవర్
సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ యరకన్నపేట గ్రామములో శుక్ర వారం పారిశుధ్య పనులు, కాలువ ల్లో పూడిక తీత ను గోవింద పురం సర్పంచ్ రెయ్యి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.అలాగే నరసాపురం పంచాయతీలో ఉన్న గ్రామాల్లో సర్పంచ్ దుక్క భూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు ఎస్. ఢిల్లేశ్వరరావు, కె. రాజేంద్ర ప్రసాద్,వార్డ్ మెంబర్ ఆదినారాయణ,స్కూల్ చైర్మన్ ఈశ్వరరావు, వాలంటీర్లు యమున, జగదీష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment