Followers

మానవ సమాజంలో ప్రతి ఒక్కరు సేవా దృక్పధం కలిగి ఉండాలి

 మానవ సమాజంలో ప్రతి ఒక్కరు సేవా దృక్పధం కలిగి ఉండాలి

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం & అంతర్గాం ఎసై నూతి శ్రీధర్


రామగుండం,  పెన్ పవర్ 

 సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా దృక్పధాన్ని అలవర్చుకుంటూ ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందిస్తూ సమాజహిత కార్యక్రమాలు చేపట్టాలని లయన్స్ క్లబ్ రామగుండం రామస్వామి మరియు అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ లు అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఎస్.అండ్.పి గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఎస్.అండ్.పి కంపెనీ ఉద్యోగులు చీల వేణుగోపాల్ రెడ్డి, పెద్దంపేట గ్రామవాసి తమ్మనవేణి కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ రామగుండం బాలాజీనగర్ కరీంనగర్, అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ ల చేతుల మీదుగా తొమ్మిది మంది ఎటువంటి ఆసరా లేని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, ఇద్దరు పేద వ్యవసాయ రైతులకు వర్షాలకు పంట తడవకుండా తాటిపత్రి లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే బాధ్యత మనుషులుగా అందరిపై ఉందన్నారు. పెద్దంపేట గ్రామవాసి తమ్మనవేణి కుమార్  తను పనిచేస్తున్న కంపెనీ సిఎస్సాఆర్ నిధులను తమ గ్రామంలోని నిరుపేదలకు అందించాలని, అనాథ ఆశ్రమాలకు చేయూతనివ్వాలని  సంకల్పంతో ముందుకు రావడం స్ఫూర్తిదాయకం అన్నారు. మహిళలకు అందించిన కుట్టు మిషన్ల  ద్వారా ఆర్థిక ప్రగతిని సాధించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడంమే కాకుండా మహిళలు ఆర్థిక ప్రగతిని సాధించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని నిరుపేదలకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కుట్టు మిషన్ నేర్చుకోవాలనే మహిళలకు లయన్స్ క్లబ్ ద్వారా ప్రతిరోజు గోదావరిఖని లోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఉదయం సాయంత్రం ఉచితంగా శిక్షణను ఇప్పిస్తున్నామని లయన్స్ క్లబ్ అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటూ లబ్ధి పొందాలన్నారు. అనంతరం రామగుండం పట్టణంలోని తబిత అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పిల్లలు, వృద్ధులు, వికలాంగుల అవసరాల మేరకు బీరువాలు, బుక్స్ ర్యాక్ సెల్ఫ్ లు, ర్యాకులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల నిరాశ్రయులైన వారిని చేరదీసి ఆశ్రయం ఇస్తున్న అనాథ ఆశ్రమాలకు దాతలు విరివిగా విరాళాలు అందజేయాలని అని కోరారు. ఒక కుటుంబాన్ని బాధ్యతగా పోషించడం కష్టతరంగా భావిస్తూ ఇబ్బందులు పడుతున్న నేటి సమాజంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆశ్రమాల నిర్వహణ చేపట్టడం అభినందనీయం స్ఫూర్తిదాయకం అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు భూక్య విమలవీరేందర్ నాయక్ లను ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో ఆశ్రమ నిర్వహణ, అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో  పెద్దంపేట గ్రామ సర్పంచ్ మేరుగు భాగ్యమ్మ, గురువయ్య, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ బాలాజీ నగర్ కరీంనగర్ సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ హెచ్.రాజిరెడ్డి, లయన్స్ క్లబ్ రామగుండం, లయన్స్ క్లబ్ బాలాజీ నగర్, కరీంనగర్ సభ్యులు బిక్షపతి, వేణుగోపాల్ త్రివేది, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.వి.రమణారెడ్డి, తమ్మన వేణి కుమార్ మిత్రబృందం, ఆశ్రమ నిర్వాహకులు భూక్య విమలవీరేందర్ నాయక్, పెద్దంపేట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...