Followers

బంగారు తెలంగాణ లో రేపటి పౌరులు దుస్థితి నేడు

 బంగారు తెలంగాణ లో రేపటి పౌరులు దుస్థితి నేడు ...

బడుల బందుతో పల్లెల్లో బర్రెలు గొర్రెలు కాస్తున్న బాలులు,,,

కేసముద్రం,  పెన్ పవర్

కరొణ వ్యాప్తి చెందుతుదన్న కారణంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా బడును బందుతో పిల్లల చదువులు మళ్లీ అటకెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో బాల బాలికలు పొలాల వెంట రోడ్ల వెంట తిరుగుతూ బర్రేలు, గొర్లు ,కాస్తున్నారు. మద్యం ప్రియులు పొలాల వెంట మద్యం సేవించి కాలిబాటిల్లు పడవేస్తే వాటిని ఎరుకోని అమ్మి చిరు బండారాలు కొనుక్కొని తింటున్నరు.  ఇలాగే ఉంటే ఉన్న కొద్ది చదువు మర్చిపోయే అవకాశం లేకపోలేదు, ప్రైవేటు విద్యా సంస్థలు( ట్రస్మా) పిల్లల చదువు మా బాధ్యతగా మేము చదువు చెబుతామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిపించాలని వారు ఉద్యమం చేసున్నది విధితమే కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పిల్లల చదువు గురించి   పుణం పరిశీలించి ఆలోచించాలని పిల్లల చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు, ఆన్లైన్ చదువుల్లో పిల్లల చదువు తక్కువ ,సెల్ ఫోన్లతో గేమ్స్ ఆడడం  ఎక్కువగా, అవుతున్నాయని తద్వారా మంచి జ్ఞానము అందకుండా ,చెడుకు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, మేధావి వర్గం తెలియజేస్తున్నారు, బర్రెలు కాస్తున్న ఒక బాలుడు కేసముద్రం మండలం లోని ఒక గ్రామంలో పెన్ పవర్ కెమెరాకు చిక్కారు. ఇది చూసి అయినా  బంగారు తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మంచి విద్యను అందించాలని అందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు మేధావులు ప్రైవేటు విద్యాసంస్థలు వాపోతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...