ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కోవిడ్ ఆసుపత్రిలో పడకలు కేటాయింపు
విజయనగరం, పెన్ పవర్
ఫ్రంట్ లైన్ వర్కర్లు, పోలీసులు, పాత్రికేయుల కోసం కోవిడ్ ఆసుప్రతుల్లో ప్రత్యేకంగా పడకలను కేటాయిస్తూ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం ఆదేశాలను జారీ చేశారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులకోసం మిమ్స్ ఆసుపత్రిలో 25 పడకలను, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం మరో 25 పడకలను మిమ్స్ ఆసుపత్రిలోనే రిజర్వు చేశారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి, వారి కుటుంబాలకు జిల్లా కేంద్రాసుపత్రిలో 25 పడకలను రిజర్వు చేశారు. అదేవిధంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 10 పడకలను కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.
No comments:
Post a Comment