బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జనజీవన్ రామ్
విజయనగరం,పెన్ పవర్
దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యాలయ ఆవరణలో 114వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. చిట్టిబాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. అప్పటికే దేశ ప్రధాని కావడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న కారణంగా కుల వివక్షత కారణంగా దేశ ప్రధాని కాలేకపోవడం చాలా విచారకరమని తెలిపారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని భారత దేశంలో అమలు చేయడంలో కృషి సల్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా,రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రి గా పని చేసి ఎనలేని కృషి చేశారన్నారు.
విధులకు బీమా పథకాన్ని పెంచడంలో, భూ పంపిణీ పథకాన్ని అమలు చేయడంలో కేంద్ర మంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి అభినoదనీయం అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న మాజీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ అలమంద జోజప్ప మాట్లాడుతు రిజర్వేషన్ పరిరక్షణ ద్వారా, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షణ ద్వారా ఆయన అశయాలును సాధించిన వారౌతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు,దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి రాయి ఈశ్వరరావు, కె వరలక్ష్మి మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment