ప్రచారంలో దూసుకుపోతున్న అందుగుల పాప
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థిని అందుగుల పాప శుక్రవారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి, అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, అభ్యర్థిని భర్త అందుగుల రవి, వైసిపి నాయకులు వల్లభశెట్టి చిన్ని, కోనాల వీర్రాజు, భరత్, సువర్ణరాజు, మరపట్ల శ్రీను, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment