Followers

విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం

 విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి  కరాళ నృత్యం

 ఆదివారం ఒకే రోజు యాభై రెండు కేసులు నమోదు
  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
 పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

విశాఖ ఏజెన్సీలో 2-వేవ్  కరోనా మహమ్మారి కరాళ  నృత్యం చేస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య జోరుగా పెరుగుతుంది. ఆదివారం ఒకే రోజు 52 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైనట్లు  ఇంచార్జ్ ఏ డి హెచ్ ఎం ఓ సూర్యారావు  ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా వైరస్ తీవ్రతరం అవుతుందని ఆదివాసీ గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదటి విడత కరోనా సమయంలో గిరిజనులు కోవిడ్ 19 నిబంధనలు తూచా అమలు  చేయటం వల్ల నవంబర్ డిసెంబర్‌లో  మాత్రమే అక్కడ అక్కడ  కరోనా కేసులు  వచ్చిన విషయం తెలిసిందే. గ్రామాల్లో ఇతరులు రాకుండా రోడ్లకు అడ్డంగా  చెట్లను వేసి స్వచ్ఛంద లాక్ డౌన్  పాటించేవారు. గ్రామాల్లోకి బంధువులు వచ్చిన ససేమిరా వద్దంటూ తిప్పి  పంపేవారు. గ్రామాల కే పరిమితమై  కరోనాపై కట్టడి చేశారు. నాడు కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ తో  మృతి చెందిన సంఘటన లేకపోలేదు. ముంచంగిపుట్టు వైసిపి నాయకుడు చిట్టి బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పాడేరు కు చెందిన ఇద్దరు వ్యక్తులు కేజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయారు.  సెకండ్ వేవ్  కరోనా ఏజెన్సీలో విలయ తాండవం చేస్తుంది. జి.మాడుగుల గురుకుల పాఠశాలలో   కరోనా పరీక్షలు చేయడంతో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేపట్టాలని అధికారులు ప్రకటిస్తున్న ప్పటికీ  స్థానికంగా పరీక్షలు కార్యరూపం దాల్చలేదు.  సెకండ్ వేవ్ కరోనా  పట్ల గిరిజనులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని వైద్య అధికారులు అంటున్నారు. ఒక పాడేరులో  600 కి పైగా కరోనా లక్షణాలు కలిగిన రోగులు ఉన్నట్లు  ప్రాథమిక అంచనా. ఇదే పరిస్థితిలో ప్రతి మండలంలో  రెండు మూడు వందలు  కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కులు భౌతిక దూరం పాటించకుండా పండగలు శుభ కార్యాలు నిర్వహించడం వల్ల కరోనా మహమ్మారి కోరలు చేస్తుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. అరకు పాడేరు ముంచంగిపుట్టులలో  స్వచ్ఛంద కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో పండుగలు పెళ్ళిళ్ళు నిర్వహించవద్దని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మే నెల 15 16 తేదీలలో నిర్వహించే పాడేరు మోదకొండమ్మ జాతరను  కరోనా దృష్ట్యా రద్దు చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. చింతపల్లి ముత్యాలమ్మ జాతరను  కమిటీ వారు రద్దు చేయడం జరిగింది. భారీగా జరిగే మోదకొండమ్మ జాతర కు  జిల్లా నలుమూలల నుంచి జనసంద్రం వస్తారని  కరోనా మహమ్మారి వల్ల జాతర నిలుపు చేయడం మంచిదని గిరిజన సంఘాలు  విజ్ఞప్తి చేస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...