Followers

కనుమరుగవుతున్న ప్రాచీన కళలు

 కనుమరుగవుతున్న ప్రాచీన కళలు......! జానపదులను కాపాడుకుందాం

కళలు, సాహిత్యం వికసించినది భరతభూమిలోనే

సంగీతం ప్రకృతి ఇచ్చిన వరం.

పల్లెల్లో గ్రామీణ సంస్కృతి కానరాక, పల్లె జానపదులు లేక పల్లె తల్లి ఘోషిస్తుంది.




నెల్లికుదురు, పెన్ పవర్

భారతదేశం సకల భిన్న సంస్కృతులకు, కళలకు, కళాకారులకు, జానపదాలకు, పుట్టనిళ్ళు అనేది ప్రపంచమెరిగిన సత్యం. కానీ నేడు దేశంలో సంస్కృతి,ప్రాచీనకళలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు తటస్థిస్తున్నది. గొప్ప సంస్కారం నాగరికత, కళలు ఎంతో ప్రాచీన కాలంనుండి భారతదేశం కలిగివున్నదని మరియు సాహిత్యం కూడ వికసించినది ఈ నేలలోనే అని 'ప్రాచీన  వాజ్మయఆధారాలు తెలియజేస్తున్నాయి "సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువుయితే దానిని మనం భారతదేశం నుండే దిగుమతి చేసుకుందాం "అని సర్ థామస్ మన్రో ఆనాడు బ్రిటిష్ వారికీ సూచించాడట, అంటే మనదేశం లో సంస్కృతి, నాగరికత,అన్నీ జిజ్జ్ఞాస అనే అంతర సూత్రంలో బందించి ఉన్నాయన్నమాట దీనికి ఉదాహరణగా మన దేశంలో ఉన్న దేవాలయాల పై పూర్వీకులు సంగీత నృత్య శిల్పాలను శిల్పకరించడమే. సంగీతం ప్రకృతి నుండి జన గానంగా ఆవిర్బవించింది. ప్రకృతి లోని జంతుజాలంనుండి మానవుడు సంగీతం నేర్చుకున్నాడు, అనేది వాస్తవం, సంగీతం లో ఉన్న సప్తపదాలు స, రి, గ, మ, ప, ద, ని, స అనేవి జంతువులనుండి వచ్చే శబ్దాలను అనుకరించినవే అని సంగీత మేధావులు తమ రచనలలో పొందుపరిచారు. ఇలా ప్రకృతి నుండి మానవుడు'రాగం 'అనే శ్రావ్యాన్ని ప్రతిపాధనగా తీసుకొని, లయను సూచించే కాలమాణమును 'తాళం 'గా తీసుకొని సంగీత స్వప్తస్వరాలకు  నాంది పలికాడు. జానపదాలుగా మారి పల్లెల్లోకి విస్తరించిన విధానం పూర్వపు రోజులల్లో సంగీతం ను దేవతార్చనకు ఉపయోగించేవారని, అదే సంగీతం భక్తి గీతాలు, జాతీయగీతాలు, విప్లవగీతాలు, "జానపదగీతాలు"గా పరిణతి చెందిoదని సామవేదం సూచిస్తుంది. ఇలా పరిణతి చెందిన సంగీతం జానపద పాటలుగా మారి విస్తరించాయి. జనపదమున నివసించేవారు "జానపదులు"వారు పాడుకొను పాటలు  "జానపదాలు ". ఇవి దేశం లోని మారుమూల పల్లె, ప్రాంతాలలోకి విస్తరించి గ్రామీణ కళాకారుల బ్రతుకులలో సహజీవనం అయింది. ఇలా అన్నీ పల్లెలలోకి, విస్తరించిన జానపద సంగీతం దేవుళ్ళ పురాణ, ఇతిహసాలు, కులదేవుళ్ళ చరిత్రలు, బావ మరదళ్ళ మధ్య ఉన్న సన్నిహిత్య సంబంధాలను జానపద పాటలుగా మార్చి, వివిధ ప్రాంతాలలో యక్షగానం, ఒగ్గుకథ, బుర్రకథ, చెక్క భజన, కోలాటం, జడకొప్పు, తోలు బొమ్మలాట, హరిదాసు, బహిండ్ల కథ, లాంటి జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ జానపద పదాలను లయబద్దంగా అల్లుకొని పాడే పాటలు ఇప్పటికీ వినసొంపుగా ఉంటాయి. ఇలాంటి ప్రాచీన కళలను నమ్ముకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బ్రతుకు జీవనం గడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి, అట్టి కళాకారులకు ఉపాధి కూడా ఉండేది. కానీ నేడు నిత్యం ప్రాచీన  దేశ సంస్కృతి, కళలను, ఆరాద్యించే  గ్రామీణ, పల్లెటూర్ల లోకి విదేశీ సంస్కృతి, నాగరికత విస్తరించి ప్రాచీన కళలను వెక్కిరిస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపదకళలు అందిస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు, కానీ ఈ రోజులలో గ్రామాలలోని కళావైభవం, గ్రామీణ సంస్కృతి కానరాక, పల్లెల్లో జానపదులు లేక పల్లె తల్లి ఘోషిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు, గ్రామీణ కళలను, సంస్కృతిని ఆరాధించి జానపద కళాకారులను ఆశీర్వదించకపోతే జానపద కళలు కాల గర్భంలో కలిసి కనుమరుగై భవిష్యత్ తరాలకు తెలియని చరిత్రగా మిగులుతాయి అనడంలో సందేహం లేదు.,....

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...