మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన
విశాఖ ఆరిలోవ, పెన్ పవర్
మహిళలు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. ఆరిలోవ హెల్త్ సిటీ హెచ్ సి జి క్యాన్సర్ సెంటర్ మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రెవేశపెట్టిన 365 రూపాయల మామోగ్రాం ప్రత్యేక ప్యాకేజి ని మిస్ విశాఖ ఫైనల్ పోటీదారుల సమక్షంలో మేయర్ ప్రారంభించారు. అనంతరం మిస్ విశాఖ పటిస్పెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పై హెచ్ సి జి క్యాన్సర్ సెంటర్ ముద్రించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మేయర్ హరికుమారి మాట్లాడుతూ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అపరిమత్తతతో ఉండాలన్నారు.
రొమ్ము క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవడం మంచిదన్నారు.వేల రూపాయలు విలువచేసే మామోగ్రాం టెస్ట్ ని గృహిణులకు సైతం అందుబాటులో ఉండే విధంగా365 రూపాయలకు హెచ్ సి జి అందించడం అభినందనీయమన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నుండి ముందస్తు జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమం లో వైసీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్,సంస్థ సి ఓ ఓ ఆదిత్య కౌరా, డాక్టర్ విజయ ఆదిత్య, వా ఉంర్డ్ కొర్పోరేటర్ కెల్ల సునీత, అశోక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment